Home తాజా వార్తలు టీచర్ ఆత్మహత్య

టీచర్ ఆత్మహత్య

SUICIDE1హైదరాబాద్ : పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ ఉపాధ్యయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజు అనే వ్యక్తి అదే పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.