Home ఆదిలాబాద్ విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఉపాధ్యాయుల కృషి అవసరం

విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఉపాధ్యాయుల కృషి అవసరం

meeting

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాశ్ యం జ్యోతి 

మన తెలంగాణ/ఆదిలాబాద్ టౌన్ : విద్యాప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు నిరంతర కృషి చేసి, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాశ్ యం జ్యోతి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన, అర్థవంతమైన రీతిలో విద్యా బోధన చేసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఉపాధ్యాయులు విద్యార్థుల యెడల ప్రత్యేకమైన శ్రద్ధతో వారిలో నమ్మకం కల్పించి చదువులో రాణించే విధంగా తోడ్పాటు చేయాలని అన్నారు. ప్రతి రోజు యోగా తరగతులు నిర్వహించాలని సూచించారు. రానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్దులుగా చేయాలని, ప్రత్యేక తరగతులను నిర్వహించి చదువుతో వెనుకబడి ఉన్న విద్యార్థులకు బోధించి, వారి సమస్యలను నివృత్తి చేయాలని అన్నారు. విద్యార్థులను స్వంత పిల్లల్లాగ చూసుకోని విద్యనందించాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంచార్జీ డిఈవో రవికాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఆశన్న, డిప్యూటి జిల్లా విద్యాశాఖాధికారి శ్యాంరావు, తదితరులు పాల్గొన్నారు.