Wednesday, March 29, 2023

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి

- Advertisement -

pdsuమనతెలంగాణ/జగిత్యాలటౌన్ : ఉపాధ్యాయులు తమ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా నుండి భారీ ఎత్తున ఉపాధ్యాయులు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మీదేవేందర్‌రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు అయిల్నేని సాగర్‌రావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సీపెల్లి రవీందర్, జెఎసి నాయకులు ఎన్నమనేని శ్రీనివాసరావు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు లేక ఏళ్ళ తరబడి ఇబ్బందులు పడుతున్నారని ఇది సరికాదన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయుల, ఎంఇఓలు, డిప్యూటీ ఇఓ, జెఎల్ ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలన్నారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌కేర్ లీవ్, రెండు సంవత్సరాలు ఇవ్వాలని, ఆదర్శ కెజిబివి, సాంఘీక సంక్షేమ పాఠశాలలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అంతకు ముందు వివిధ మండలాల నుండి ఉపాధ్యాయులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిల్నేని నరేందర్‌రావు, వొడ్నాల రాజశేఖర్, రాష్ట్ర బాధ్యులు ఎలిగేటి రాజేంద్రప్రసాద్, లింబగిరి స్వామి, గడ్డం మహిపాల్‌రెడ్డి, గుర్రాల ప్రేమ్‌కుమార్, మదన్‌మోహన్‌రావు, అశోక్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, వనతడుపుల రవికుమార్, చంద్రశేఖర్‌రావు, విష్ణు, మల్హాల్‌రావు, ఆనంద్‌రావు, బొమ్మకంటి శ్రీనివాస్, ప్రసాద్‌రావు, రత్నాకర్, పూర్ణచందర్, నర్సింగరావు తదితరులు పాల్గొనగా వివిధ పార్టీల నాయకులు బండ శంకర్, శ్రీరాముల గంగాధర్, లింగంపేట శ్రీనివాస్, అంకారి సుధాకర్, ఎసిఎస్ రాజు, జగదీష్, అనిల్, కిషోర్ సింగ్ తదితరులు సంఘీభావం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News