Home తాజా వార్తలు టీచర్ల పదోన్నతులు త్వరలో

టీచర్ల పదోన్నతులు త్వరలో

Teachers Promotions

 

హైదరాబాద్ : నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులను త్వరలోనే చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అప్‌గ్రేడ్ అయిన భాషా పండితులు, పిఇటి పోస్టులతో సహా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. సోమవారం ఎంఎల్‌సి నర్సిరెడ్డి నేతృత్వంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి(యుఎన్‌పిపి), ఉపాధ్యాయ సంఘాల జెఎసి(జాక్టో) ప్రతినిధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా తీసుకుని టీచర్లకు పదోన్నతులు కల్పించే ఆలోచన ఉందని, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.అంతర్‌జిల్లా బదిలీలు నిర్వహించాలని, సీనియర్ ప్రధానోపాధ్యాయులను డిప్యుటేషన్‌పై ఎంఇఒ పోస్టులలో నియమించాలని కోరారు. కొత్త జిల్లాల్లో ఎస్‌ఎస్‌సి స్పాట్ కేంద్రాలను ఏర్పాటు , మోడల్ స్కూల్స్ టీచర్లకు సర్వీస్‌రూల్స్ విడుదల చేయాలని కోరారు. ఆర్థిక భారం లేని సమ స్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాలయ సంఘాల నేతలు సిహెచ్ రాములు, చావ రవి తదితరులు పాల్గొన్నారు.

Teachers Promotions Soon