Home తాజా వార్తలు ఛలో అసెంబ్లీ భగ్నం

ఛలో అసెంబ్లీ భగ్నం

govt-employees

హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుల ఛలో అసెంబ్లీని పోలీసులు ఉక్కుపాదంతో అణచివేవారు. సిపిఎస్ రద్దు, పాత పింఛన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చైక్ వద్దకు వచ్చిన వారు అసెంబ్లీ వైపు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులను అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులను అక్కడే అరెస్టు చేశారు. ఒక వేళా అక్కడి నుంచి తప్పించుకుని వస్తే నగర శివారులో పట్టుకున్నారు.

టీచర్ల ఛలో అసెంబ్లీకి అనుమతి లేదని ఒక వేళా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అయినా కూడా ఉపాధ్యాయులు ఇందిరిపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అనుమతించలేదు. దీంతో ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై బైటాయించిన ఉపాధ్యాయులను పోలీసులు కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారు. దీంతో ఇందిరాపార్క్ సమీపంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మహిళా ఉపాధ్యాయులను ఉమెన్ కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు.

ముందు జాగ్రత్త పడ్డ పోలీసులు…

అసెంబ్లీ ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎబివిపి, పిడిఎస్‌యూ విద్యార్థులు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం అసెంబ్లీని ముట్టడించిన విషయం తెలిసిందే. పోలీసులు భద్రతను ఏర్పాటు చేసినా కూడా విధ్యార్థులు దానిని ఛేదించుకుని ముందుకు వచ్చారు. ఏకంగా అసెంబ్లీ గేట్ నుంచి లోపలికి దూకేందుకు యత్నించారు. దీంతో పోలీసుల భద్రతా లోపాలు బయటపడ్డాయి. అంతేకాకుండా విద్యార్థులపై విపరీతంగా లాఠీ చార్జ్ చేయడంతో పలువురు విమర్షలు గుప్పించారు. దీంతో ముందగానే మోల్కొన్న నగర పోలీసులు నగర పోలీసులు మాత్రమే కాకుండా, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన పోలీసులను భద్రతకు మోహరించారు. భారీగా భద్రతను ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఉపాధ్యాయులను అసెంబ్లీ వైపు రాకుండా నిలువరించగలిగారు. ఉపాధ్యాయుల ధర్నాను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Teachers Union Holds Chalo Assembly Protest