- పుణెలో తొలి టెస్ట్, బెంగళూర్‌లో రెండో టెస్టు
- ఫిబ్రవరి 23 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం
ముంబయి : నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకుగాను 16 మందితో కూడిన భారత జట్టును బిసిసిఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ) మంగళవారం ప్రకటించింది. ఫి బ్రవరి 23 నుంచి పుణె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. భారత్ టెస్టు జట్టకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన భారత్ 208 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాతో ఆడిన అదే భారత్ జట్టును కొనసాగింపుగా ఎమ్ఎస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి టెస్టు మ్యాచ్ పుణెలో జరుగనుండగా, రెండవ టెస్టు మ్యాచ్ మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో జరుగనున్నట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులో స్థానం కల్పించిన బిసిసిఐ, తమిళనాడు ఆటగాడు అభినవ్ ముకంద్కు జట్టులో చోటు కల్పించింది. గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు దూరమైన అమిత్ మిశ్రా స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. దాంతో తుది జట్టులో కుల్దీప్, అభినవ్లకు ఆడే ఆవకాశం దక్కకుండా పోయింది.
తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆడనున్న భారత జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, పూజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవిచంద్ర జడేజా, జయంత్ యాదవ్, కరుణ్ నాయర్, అభినవ్ ముకంద్, ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్.