Home తాజా వార్తలు వెస్టిండీస్ టూర్‌లో టీమిండియాకు ఉగ్ర ముప్పు?

వెస్టిండీస్ టూర్‌లో టీమిండియాకు ఉగ్ర ముప్పు?

india

కూలిడ్జ్ : వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఉగ్రముప్పు పొంచి ఉందని ఆదివారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి ఒక ఈ మెయిల్ రావడంతో బిసిసిఐ అధికారులు అప్రమత్తమైనారు. అయితే అది తప్పుడు మెయిల్ అని నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ దీనిపై ఆంటిగ్వాలోని భారత హైకమిషనర్‌కు సమాచారమిచ్చినట్లు బిసిసిఐ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు.ఈ నేపథ్యంలో హైకమిషన్ స్థానిక ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్త చేసిందని, భారత ఆటగాళ్లకు అదనపు భద్రతను ఏర్పాటు చేశారని ఆ అధికారి చెప్పారు. ఆటగాళ్ల విషయంలో బిసిసిఐ తగు జాగ్రత్తలు తీసుకుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆ అధికారి చెప్పారు. అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉందని , అవసరమైతే మరింత భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా టీమిండియా ఇప్పటికే టి20, వన్‌డే స్‌లు గెలుచుకొని ప్రస్తుతం కూలిడ్జ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. సోమవారం ఈ మ్యాచ్ పూర్తవుతుండగా, ఈ నెల 22నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీంతో ఈ టెస్టు సిరీస్‌లోను రాణించి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

Team India gets terror threat on PCB email