Home తాజా వార్తలు భారత్‌కే ఆ సత్తా ఉంది

భారత్‌కే ఆ సత్తా ఉంది

 Australia in Test cricket

 

మైఖేల్ వాన్

అడిలైడ్: ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాను ఓడించే సత్తా ఒక్క టీమిండియాకు మాత్రమే ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 20తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాన్ స్పందించాడు. కొంత కాలంగా ఆస్ట్రేలియా జోరును చూస్తుంటే పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతుందన్నాడు. సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌లలో కంగారూలను ఓడించడం ప్రత్యర్థి జట్లకు దాదాపు అసాధ్యంగా మారిందన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జోరుకు బ్రేక్ వేసే జట్టు ఏదైన ఉందంటే అది ఒక్క టీమిండియా మాత్రమేనని వాన్ జోస్యం చెప్పాడు. సమకాలిన క్రికెట్‌లో ప్రస్తుతం ఈ రెండు జట్లే చాలా బలంగా ఉన్నాయన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఈ జట్లకు అందుబాటులో ఉన్నారన్నాడు.

దీంతో ఈ జట్ల మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగడం ఖాయమన్నాడు. ఇక, భారత జట్టు కూడా కొంత కాలంగా టెస్టుల్లో నిలకడైన విజయాలు సాధిస్తున్న విషయాన్ని వాన్ గుర్తు చేశాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటికే వరుసగా ఏడు విజయాలు సాధించిందన్నాడు. ఇదే క్రమంలో ప్రత్యర్థి జట్లకు అందనంత ఎత్తులో నిలిచిందన్నాడు. ఆస్ట్రేలియా కూడా వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతుందన్నాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో పోల్చితే ప్రస్తుతం ఆస్ట్రేలియా చాలా మెరుగ్గా కనిపిస్తుందన్నాడు. న్యూజిలాండ్ జట్టులో నిలకడగా కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లే ప్రపంచ క్రికెట్‌ను శాసించడం ఖాయమని వాన్ జోస్యం చెప్పాడు.

Team India has capacity to beat Australia in Test cricket