Home తాజా వార్తలు బంగ్లా ఆట అద్భుతం

బంగ్లా ఆట అద్భుతం

Shoaib-Akhtar

కరాచీ: భారత్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టు పోరాట పటిమపై పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీస్‌ను నెగ్గడం ద్వారా ప్రపంచంలో తానే అత్యుత్తమ జట్టు అని భారత్ మరోసారి నిరూపించిందన్నాడు. అయితే సిరీస్‌లో ఓడినా బంగ్లాదేశ్ పోరాట పటిమ అసాధారణం అని ప్రశంసించాడు. తొలి టి20లో గెలవడం ద్వారా తానెంటో బంగ్లా ప్రపంచానికి చాటిందన్నాడు.

అంతేగాక భారత్ వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుందన్నాడు. అంతేగాక ఆఖరి మ్యాచ్‌లో బంగ్లా పోరాడిన తీరు తనను కట్టి పారేసిందన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బంగ్లా అద్భుతంగా ఆడడం ఊరటనిచ్చే అంశమన్నాడు. ఇక, చివరి టి20లో భారత స్పీడ్‌స్టర్ దీపక్ చాహర్ ప్రదర్శన క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోతుందన్నాడు. క్లిష్ట సమయంలో కూడా నిబ్బరంగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక వికెట్లు తీయడం ద్వారా చాహర్ సరికొత్త స్టార్‌గా అవతరించాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

Team India is on another level Says Shoaib Akhtar