Friday, June 13, 2025

చెమటోడ్చిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

లండన్(లార్డ్): వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) 2025-27కు టీమిండియా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. ఈ సీజన్‌ను భారత్ ఇంగ్లండ్‌పై ప్రారంభించనుంది. ఈసారి సిరీస్ గెలుపొంది 18 ఏళ్ల నిరీక్షణనకు తెరదింపాలనే భావిస్తోంది. అందులో భాగంగా ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుకోవాలనే పట్టుదలతో ఉంది. అందుకు సాధన షురూ చేసింది టీమిండియా. ఇంగ్లండ్‌కు చేరుకున్న మరుసటి రోజే ఆటగాళ్లంతా ముమ్మర సాధన చేస్తూ కనిపించారు. క్రికెట్ పట్టినిల్లు లార్డ్స్‌లోని ఇండోర్ స్టేడియంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులంతా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాల్లో సాధనచేశారు. మహ్మద్ సిరాజ్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లు బౌలింగ్ ప్రాక్టీస్‌ (Bowlers bowling practice) తో బిజీగా గడిపారు. ఇక కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సిరాజ్, ప్రసిద్‌లు ఫుట్‌బాల్ ఆడుతుండగా.. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సమక్షంలో క్యాచ్‌లు సాధన చేశారు. కాగా.. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జూన్ 20 ప్రారంభం కానుంది. అయితే.. అంతకంటే ముందు టీమిండియా నాలుగు రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News