- Advertisement -
బ్రిస్బేన్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 70 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. మయాంక్ అగర్వాల్ 38 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 23 పరుగులుచేసి హజిల్ వుడ్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. భారత బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ (44), ఛటేశ్వర్ పూజారా (25), రహానే(37), గిల్(07) పరుగులు చేసి ఔటయ్యారు ఆసీస్ బౌలర్లలో హజిల్ వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా స్టార్క్ , కమ్నీస్, నాథన్ లయన్ తలో ఒక వికెట్ పడగొట్టారు.
- Advertisement -