Friday, April 26, 2024

టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

Team India selected for Test Championship final

25 మందితో జంబో జట్టు, స్టాండ్‌బైలుగా మరో నలుగురు, ఇంగ్లండ్ సిరీస్‌కూ ఇదే టీమ్

ముంబై : ప్రతిష్టాత్మకమై ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. జూన్ 18 నుంచి ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ సమరం కోసం 25 మందితో కూడిన భారీ జట్టును సెలెక్టర్లు ఖరారు చేశారు. ఇక డబ్లూటిసి ఫైనల్ అనంతరం భారత్ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా ఇదే జట్టు బరిలోకి దిగనుంది. ఇక టీమిండియాకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వైస్ కెప్టెన్‌గా మరోసారి అజింక్య రహానెను ఎంపిక చేశారు. సీనియర్లు చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, ఇషాం త్ శర్మ, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా తదితరులకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఫిట్‌నెస్ పరీక్షలు నెగ్గితే వృద్ధిమాన్ సాహా, కెఎల్. రాహుల్‌లు ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళుతారు.

ఇక కొత్తగా నలుగురు యువ క్రికెటర్లకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. వీరిలో అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జున్ నాగ్‌వస్వల్లా ఉన్నారు. కీలక ఆటగాళ్లందరికీ జట్టులో చోటు దక్కింది. సీనియర్ బౌలర్లు ఇషాంత్, అశ్విన్, బుమ్రా, షమి, ఉమేశ్, జడేజాలు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక బ్యాటింగ్‌లో మరోసారి కోహ్లి, రోహిత్, పుజారా, రహానె, విహారిలు జట్టుకు కీలకంగా మారారు. యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్‌లు జట్టులో చోటు కాపాడుకున్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లకు మరో అవకాశం లభించింది. హైదరాబాది మహ్మద్ సిరాజ్ కూడా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

జట్టు వివరాలు…

విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News