Wednesday, April 24, 2024

ధోనీ రీ ఎంట్రీ కోహ్లీ చేతుల్లోనే..

- Advertisement -
- Advertisement -

Suresh-Raina

జట్టుకు మాజీ సారథి సేవలు అవసరం: సురేశ్ రైనా

ముంబయి: భారత జట్టుకు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అయితే అతడితో ఎలా ముందుకెళ్లాలనేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతిలో ఉందని సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నాడు. రైనా, ధోనీలు ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఐపిఎల్‌లో రాణించడానికి రైనా, అంబటి రాయుడు చెన్నైలో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కాగా మార్చి తొలి వారంలో ధోనీ కూడా వారితో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టే అవకాశం ఉందని రైనా చెప్పాడు.‘ ఐపిఎల్‌లో సాధన చేయడానికి ధోనీ మార్చి మొదటివారంలో చెన్నైకి రావచ్చు. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై పలకాలని అనుకుంటే ఎలాంటి ఆర్భాటమూ లేకుండా వైదొలగుతాడు. అయితే అతను క్రికెట్ ఆడటాన్ని చూడాలనుకుంటున్నా. ఇప్పటికీ ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. టీమిండియాకు కూడా అతడి అవసరం ఉందనుకుంటున్నా. అయితే అతడితో ఎలా ముందుకెళ్లాలనేది కోహ్లీ చేతుల్లో ఉంది’ అని రైనా అన్నాడు.ప్రపంచ కప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఐపిఎల్‌లో రాణించి ప్రపంచకప్‌కు టీమిండియాలో స్థానం సంపాదించాలని రైనా అనుకుంటున్నాడు.‘ ఐపిఎల్‌లో రాణిస్తే టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. మోకాలు సహకరిస్తే ఐపిఎల్‌లో రాణిస్తా. ఇక రెండు మూడేళ్లు మాత్రమే క్రికెట్ ఆడగలను.ఈ రెండేళ్లలో వరసగా రెండు టి20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. నేను టి20ల్లో అద్భుత ప్రదర్శన చేయగలను’ అని రైనా అన్నాడు. రైనా ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

Team India still needs MS Dhoni says Suresh Raina

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News