Tuesday, February 7, 2023

లక్ష్య చేధనలో తడబడుతున్న టీమిండియా

- Advertisement -

Virat-Kohli-Outకోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న మూడో వన్డేలో 322 పరుగుల భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కెె ఎల్ రాహుల్, రహానే స్వల్ప స్కోర్ చేసి పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ కలిసి కుదురుగానే ఆడారు. కానీ అర్ధశతకం నమోదుచేసిన కోహ్లి(55) పరుగుల వద్ద స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ ప్లంకెట్ బౌలింగ్ లో యువరాజ్ (45) పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో మ్యాచ్లో శతకంతో రాణించిన మాజీ కెప్టెన్ ధోని 6 పరుగులు చేసి పెవీలియన్ బాటపట్టాడు. దీంతో భారీ టార్గెట్ ను చేధనలో భారత కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా క్రీజ్ లో ఉన్నారు. స్కోర్: 209/5 (38 ఓవర్లు).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles