Friday, March 29, 2024

నాగాల్యాండ్‌లో సికాడాజాతి కీటకాన్ని కనుగొన్న శాస్త్రవేత్తల బృందం

- Advertisement -
- Advertisement -

Team of scientists discovered cicada insect in Nagaland

నాగాల్యాండ్‌లో సికాడాజాతి కీటకాన్ని
కనుగొన్న శాస్త్రవేత్తల బృందం

షిల్లాంగ్: నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నాగాల్యాండ్‌లో సికాడాజాతికి చెందిన కీటకాన్ని కనుగొన్నారు. ఆ రాష్ట్రంలో ఈజాతి కీటకాన్ని కనుగొనడం ఇదే ప్రథమం. ఇప్పుడు కనుగొన్న కీటకం శాస్త్రీయ నామం ‘ప్లాటిలోమియా కోహిమేన్సిస్’ అని కీటకశాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌హెచ్ హజాంగ్ తెలిపారు. ఈ కీటకానికి సంబంధించిన వివరాలను జీవుల వర్గీకరణ పత్రిక ‘జుటాక్సా’లో ప్రచురించారు. హజాంగ్‌తోపాటు డాక్టర్ లిమాటెంజెన్ ఈ కీటకం వివరాలను వెల్లడించారు. సికాడా కీటకాలు పెద్ద తలతో, స్పష్టమైన రెక్కలతో ప్రత్యేక లక్షణాల్ని కలిగి ఉంటాయి. కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో సికాడాజాతికి చెందిన 70 రకాల కీటకాల్ని కనుగొనడం కోసం చేపట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా శాస్త్రవేత్తల బృందం పని చేస్తోంది. సికాడాజాతికి చెందిన కీటకాలు ప్రపంచంలో దాదాపు 3000 రకాలున్నాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. ఏడాదికోసారి కనబడేవాటిని వార్షిక సికాడాలుగా, దశాబ్దానికో, రెండు దశాబ్దాలకో ఓసారి కనిపించేవాటిని పీరియాడికల్ సికాడాలుగా భావిస్తారు. సికాడాజాతి కీటకాలు ఎక్కువగా అజ్ఞాతంగా జీవిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News