Home తాజా వార్తలు పుణె చేరిన కోహ్లి సేన

పుణె చేరిన కోహ్లి సేన

Teamindia

 

పుణె : దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు కోసం టీమిండియా సోమవారం పుణె చేరుకుంది. విశాఖపట్నం నుంచి భారత క్రికెటర్లు ప్రత్యేక విమానంలో పుణె చేరుకున్నారు. వీరికి పుణె ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం సదేశంలో సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా, భారత్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు జరుగనుంది. దాదాపు వారం రోజుల విరామం తర్వాత ఈ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఇటు సౌతాఫ్రికా, అటు భారత క్రికెటర్లకు తగినంత విరామం లభించింది. ఇక, విజయదశమి పండగ నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్లు సొంత నగరాలకు వెళ్లే అవకాశం ఉంది.

మిగిలిన ఆటగాళ్లు జట్టుతో పాటే ఉండి సాధనలో పాల్గొంటారు. మరోవైపు పుణెలో జరిగే మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆటగాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేగాక మ్యాచ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక పిచ్‌ను ఆటకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఉన్నారు. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన దక్షిణాఫ్రికాకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో సఫారీ ఉంది. ఇందు కోసం తీవ్ర సాధన చేసేందుకు సిద్ధమైంది.

Teamindia has reached Pune