Friday, March 29, 2024

అగ్రస్థానంలోనే టీమిండియా

- Advertisement -
- Advertisement -

TeamMindia

 

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: ప్రపంచ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైనా టీమిండియా టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. మంగళవారం ఐసిసి ప్రకటించిన తాజా టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం భారత్ 116 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్‌పై క్లీన్‌స్వీప్ సాధించిన న్యూజిలాండ్ తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుంది. ప్రస్తుతం కివీస్ 110 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, ఆస్ట్రేలియా మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 108 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో నిలిచింది. ఇంగ్లండ్ నాలుగో, సౌతాఫ్రికా ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.

స్మిత్‌దే టాప్
ఇక, వ్యక్తిగత బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ప్రస్తుతం స్మిత్ రెండో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే 25 పాయింట్ల ఆధిక్యంతో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలం కావడంతో కోహ్లి భారీగా రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు. అయినా కోహ్లి రెండో ర్యాంక్‌కు ఎలాంటి నష్టం కలుగలేదు. స్మిత్ 911 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. కోహ్లి 886 పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక, ఆస్ట్రేలియా సంచలనం లబూషేన్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాలుగో, పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ ఐదో ర్యాంక్‌లో నిలిచారు.

భారత సీనియర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన అజింక్య రహానె తాజా ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కమిన్స్ 904 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ ఎడమ చేతి స్పీడ్‌స్టర్ నీల్ వాగ్నర్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కివీస్‌కే చెందిన టిమ్ సౌథి నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ స్పీడ్‌స్టర్ జాసన్ హోల్డర్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికా స్టార్ రబడా ఐదో ర్యాంక్‌లో నిలిచాడు.

TeamMindia Top Ranked in World Test Team Rankings
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News