* రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు
మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: కాళేశ్వ రం ప్రాజక్టు పూర్తయితే రైతు కన్నీళ్లకు చర మగీతం పడటమే కాకుండా వ్యవసాయం ఇక పండగగా మారుతుందని మంత్రి టీ.హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట మండ లం తడకపల్లిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభు త్వం విద్య, వైద్య రంగాలతో పాటు అభివృద్ధి కి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మల్ల న్నసాగర్ ప్రాజక్టును నిర్మించి తడకపల్లి గ్రా మంలో 2200 ఎకరాలకు కాలువల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్ర వేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు స ద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. కొద్ది రోజుల్లో తడకపల్లి గ్రామా నికి కేంద్రీయ విద్యాలయం మంజూరుకాను న్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి యాదయ్య, డీఆర్‌డిఎ స్వామిగౌడ్, సర్పంచ్ బాల్‌నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల భవనానికి శంకుస్థాపన
తడకపల్లిలోని ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్నందున విద్యార్థు లు కష్టపడి చదవాలని, ఉపాధ్యాయులు వారిని పరీక్షలకు సన్నద్ద ంచేయాల ని సూచించారు. చదవులు వెనుకబడి వున్న విద్యార్థులను గుర్తించి వంద శా తం ఉత్తీర్ణత సాధించే దిశగా కసరత్తు చేయాలని అన్నారు. విద్యార్థులు చిన్న తనంలో కష్టపడి చదివే మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవొ విజయలక్ష్మి, హెచ్‌ఎం రాజిరెడ్డి, సర్పంచ్ బాలనర్స య్యలు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట మండలం వెంకటాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.