Home తాజా వార్తలు షారుఖ్ ఖాన్ కుమార్తె నటనకు ఫ్యాన్స్ ఫిదా… (వీడియో)

షారుఖ్ ఖాన్ కుమార్తె నటనకు ఫ్యాన్స్ ఫిదా… (వీడియో)

ముంబయి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌కు ఇంటర్‌నెట్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లండన్‌లో చదువుకుంటున్న సుహానా ఇప్పటివరకు ఏ చిత్రంలో నటించనప్పటికీ ఆమె పేరిట సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్ పేజీలు ఉండడం విశేషం. అయితే సుహానా నటించిన తొలి షార్ట్ ఫిలిమ్‌కు చెందిన వీడియో టీజర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సుహానా ఖాన్ ఇంగ్లండ్‌లోని తన స్కూలు మిత్రులతో కలసి ఈ షార్ట్ ఫిలిమ్ నిర్మించింది. ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే టైటిల్‌తో నిర్మించిన ఈ షార్ట్ ఫిలిమ్ టీజర్‌ను దాని దర్శకుడు ధియోడోర్ డిమెనో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. లండన్‌లోని ఆర్డింగ్లీ కాలేజ్ నుంచి ఈ మధ్యనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుహానా ఖాన్ త్వరలోనే బాలీవుడ్‌లో తెరగేంట్రం చేసే అవకాశం ఉంది.

Teaser of Suhana Khans Short Film Goes Viral, Fans Say Shes Born to Act Like Shah Rukh Khan, A video teaser of Shah Rukh Khans daughter Suhana Khan’s first short film, The Grey Part of Blue is viral on the Internet and fans cant stop talking about it.