Home తాజా వార్తలు ‘రూలర్’ సినిమా నుంచి టీజర్ విడుదల

‘రూలర్’ సినిమా నుంచి టీజర్ విడుదల

Ruler Telugu Movieహైదరాబాద్  : నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా ‘రూలర్’. ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నటించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను గురువారం విడుదల చేశారు. వైవిధ్యమైన కథతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో బాలయ్య కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకునే పోలీసు అధికారి ‘ధర్మ’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య యంగ్ లుక్ తో స్టైలిష్ గా కనిపించనున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలు ఈ టీజర్ లో ఉన్నాయి. ఇంకా ఈ సినిమాాలో జయసుధ, భూమిక, షియాజీ షిండే, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబరు 20న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Teaser Release From Ruler Telugu Movie