Home తాజా వార్తలు విమానానికి తప్పిన పెను ప్రమాదం

విమానానికి తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని ఆపేశారు. 156 మంది ప్రయాణీకులతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించి పైలట్ విమానాన్ని ఆపేశాడు. రన్‌వేపై ముందుకు కదులుతున్నప్పుడు గుర్తించడంలో పెను ప్రమాదం తప్పింది. రెండు గంటల అనంతరం మరో విమానంలో ప్రయాణీకులను ఢిల్లీకి పంపించారు. ఇండిగో సిబ్బంది ఇదే చిన్న సమస్య అని చెబుతున్నారు. కానీ నింగిలో ఉన్నప్పుడు జరిగి ఉంటే 156 మంది ప్రాణాలు గాల్లో కలిసేవని చెబుతున్నారు.

 

Technical Issues Raised-in Indigo plane at Shamshabad