Thursday, April 25, 2024

లోన్‌ యాప్‌ వేధింపులకు బలైన మరో యువకుడు

- Advertisement -
- Advertisement -

Teenager Commits Suicide for Loan APP Harassment

హైదరాబాద్: లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి రామగుండం ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో పనిచేస్తున్న సంతోష్ పలు యాపుల ద్వారా రుణాలు తీసుకున్నాడు. లోన్ చెల్లించాలని యాప్ ఏజెంట్లు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఆయనను కరీంనగర్ లో ఓ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వైజాగ్ లోని జార్జ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స  పొందుతూ బాధితులు ప్రాణాలు విడిచాడు. మృతుడిని విశాఖపట్నం వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ఎన్టీపిసి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు ముందు సంతోష్ సెల్ఫీ వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ లోన్ యాపుల నిర్వహకులపై పోలీసులు కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Teenager Commits Suicide for Loan APP Harassment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News