Wednesday, April 24, 2024

తేజస్వీ బీహార్ సిఎం అయితే ఆశ్చర్యపోను: శివసేన ఎంపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయితే, అందుకు తానేమీ ఆశ్చర్యపోనని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ అన్నారు. ఓవైపు తన కుటుంబసభ్యులు జైలులో ఉండగా, ఎవరి మద్దతు లేకుండా ఎన్నికలను ఎదుర్కొంటున్న యువనేతకు ఎన్‌డిఎ నుంచి పెద్ద సవాలే ముందుందని రౌత్ అన్నారు. సిబిఐ, ఆదాయం పన్నుశాఖ ప్రతిపక్షాల నేతలను వెంటాడుతున్నాయని ఆయన విమర్శించారు. కొవిడ్19 ఫ్రీ వ్యాక్సిన్‌కు హామీ ఇచ్చిన బిజెపిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్ బిజెపికి ఓ శాఖగా వ్యవహరించిందని ఆయన అన్నారు. పూణెలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ తీరుపైనా ఆయన ఛలోక్తులు విసిరారు. ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ దగ్గరికి సహాయం కోసం గవర్నర్ కొందరిని పంపారన్న వార్తలపై స్పందిస్తూ, గవర్నర్‌కు లేదా బిజెపికి సలహాలు కావాలంటే పవార్ ఇవ్వొచ్చని అన్నారు. మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంలో ఎన్‌సిపి భాగస్వామ్య పక్షమన్నది తెలిసిందే.

Tejashwi Yadav will becomes Bihar CM: MP Sanjay Raut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News