Home అంతర్జాతీయ వార్తలు వాణిజ్య, వ్యాపార రంగాల్లో న్యూజెర్సీతో తెలంగాణ ఒప్పందం

వాణిజ్య, వ్యాపార రంగాల్లో న్యూజెర్సీతో తెలంగాణ ఒప్పందం

Minister KTRహైదరాబాద్ : వాణిజ్య , వ్యాపార రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణలో వాణిజ్య, వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. న్యూజెర్సీలో తెలుగువారు అధికంగా ఉన్నారని ఆయన చెప్పారు. న్యూజెర్సీతో ఒప్పందం వల్ల తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము అనుకూలంగా ఉన్నామని న్యూజెర్సీ గవర్నర్ తెలిపారు.

Telangana Agreement With New Jersey on Trading