Friday, April 26, 2024

విద్యుత్ రంగంలో అద్భుత విజయం

- Advertisement -
- Advertisement -

Power-Sector

హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు విధించేవారు. హైదరాబాద్‌లో రోజు 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. విభజన చట్టం ప్ర కారం ఇవ్వాల్సిన కరెంట్‌ను ఎపి ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు.

సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్‌గా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను తగ్గించుకోగలిగారు. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసరం కాబట్టి, ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంట్ అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొని పిజిసిఎల్ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు.

2014 నవంబర్ 20 నుంచి కోతల్లేని విద్యుత్

ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడంతో 2014, నవంబర్ 20 నుంచి కోతల్లేని విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నారు. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రంలో విద్యుత్ కోతలుండకుండా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 28 వేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి జరగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తోంది.

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్

ప్రభుత్వం 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల పాటు కరెంటు అందిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రంలోని 30 శాతం కరెంట్ ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కోసం చేసిన కేటాయింపులు 3,621 కోట్లు కాగా. తెలంగాణ వాటా 1,521 కోట్లు. కానీ నేడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేటాయించిన బడ్జెట్ పది వేల కోట్ల రూపాయలు.

పెరిగిన స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం

2014లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మె.వా. కాగా, ఫిబ్రవరి 2020 నాటికి వందశాతానికి పైగా పెరిగి 15,980 మె.వా. అందుబాటులోకి వచ్చిం ది. ఇందులో 3,681 మె.వా. సోలార్ విద్యుత్ కూడా ఉంది.

యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం

4వేల మెగావాట్ల రికార్డు స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో జెన్ కో దామరచర్లలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మిస్తోంది. ఈ ప్లాంటు కొత్త రికార్డు సృష్టించబోతుంది. నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక రాష్ట్రం తన కు తానుగా 4వేల మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్లాంటు స్థాపించడం దేశంలోనే ఇది ప్రప్రథమం.

భద్రాద్రి పవర్ ప్లాంట్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని ఏడూళ్ల బయ్యారం వద్ద 1,080 మెగావాట్ల (4 X 270) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ స్టేషన్ (బిటిపిఎస్) త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తోంది.
రికార్డు సమయంలో కెటిపిఎస్ 7వ దశ నిర్మాణం

కెటిపిఎస్ 7వ యూనిట్ నిర్మాణాన్ని కేవలం 42 నెలల్లోనే పూర్తిచేసి, 800 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చింది. 2015 జనవరి 1న ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2018 జూన్ 30 నాటికి ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది.

వచ్చే మూడేళ్లలో మరో 10 వేల మెగావాట్లు

రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యానికి అనుగుణంగా పడుగులు వడవడిగా పడుతున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రామగుండం ఎన్‌టిపిసిలో 4,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటిదశలో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయి. సింగరేణి నుంచి మరో 800, సిజిఎస్ ద్వారా మరో 809, సోలార్ ద్వారా ఇంకో 1,584, హైడల్ ద్వారా ఇంకో 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుం ది. వీటన్నిటి ద్వారా వచ్చే మూడేళ్లలో పదివేలకు పైగా మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుంది. విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగు పర్చడంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 99.90 శాతం ట్రాన్స్ మిషన్ అవేలబులిటీతో దేశ సగటును మించింది. దీనికోసం రూ.27,770 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది.

దేశ సగటును మించిన తలసరి విద్యుత్ వినియోగం

విశ్వవ్యాప్తంగాప్రగతిసూచికలుగా (indicators) గుర్తించే అంశాల్లోతలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈఅంశంలో రాష్ట్రం దేశ సగటును మించింది. 2018-,19 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం1,181యూనిట్లు కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం1,896 యూనిట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుంటే, ఆరేళ్లలో 39.82శాతం పెరిగింది.

ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి, ప్రథమ స్థానంలో నిలిచింది. 2017,-18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018-, 19 నాటికి 1,896కి చేరింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2017-,18లో దేశ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,149 యూనిట్లుంటే, 2019-, 20లో 1,181 యూనిట్లు నమోదయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News