Home తాజా వార్తలు విద్యుత్ సిబ్బంది విభజన

విద్యుత్ సిబ్బంది విభజన

Electricity-Staff
1157 మంది ఎపి ఉద్యోగుల్లో 613 మంది స్వరాష్ట్రానికి, తెలంగాణకు 504 మంది

మన తెలంగాణ, సిటీబ్యూరో: విద్యుత్ ఉద్యోగుల విభజనపై ధర్మాధికారి కమిటీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి రిలీవ్ చేయబడిన 1,15 7 మంది ఆంధ్రా ఉద్యోగులను వారి ఆప్షన్ ప్రకారం 613 మందిని ఎపికే కేటాయించగా, 504 మంది ఉద్యోగులను తెలంగాణను కేటాయించింది. అలాగే 1,157 మంది ఉద్యోగులతో స ంబంధం లేని 256 మంది ఆంధ్రా ఉ ద్యోగుల్లో 50 శాతం అంటే 128 మం దిని తెలంగాణకు కేటాయించింది. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగులను కేటాయిస్తూ జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై తాజ్ డెక్కన్ హోటల్‌లో రెండు రోజులపాటు జరిగిన ధర్మాధికారి కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఈ అంశంపై ఇకపై ఎలాంటి వాదోపవాదాలకు తావు లేదని. ఇవే తుది కేటాయింపులని కమిటీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన ఏకసభ్య కమిషనర్ జస్టిస్ ధర్మాధికారి ఇరు వర్గాల వాదనలు విని ఎపి స్థానికత కలిగిన 613 మంది ఉద్యోగులను ఎపికి, తెలంగాణ స్థానికత కలిగిన 504 మంది తెలంగాణకు కేటాయించారు. ఎపి నుంచి తెలంగాణకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 256 మంది ఉద్యోగుల్లో 50 శాతం మందిని తెలంగాణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంధ్రాలో పనిచేస్తున్న 242 మంది తెలంగాణ ఉద్యోగులను కూడా తీసుకోవడానికి తెలంగాణ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఈ కేటాయింపులను ఎపి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించడం లేదు.

తుది నివేదిక ఆధారంగానే కేటాయింపులు చేశామని, నివేదికను కోర్టుకు అందజేస్తామని ధర్మాధికారి కమిటీ స్పష్టం చేసింది. ఈ విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, కాలయాపన జరుగుతుండటంతో పదోన్నతులు ప్రక్రియ ఆగిపోయిందని తెలంగాణ విద్యుత్ శాఖ ధర్మాధికారి కమిటీకి విన్నవించింది. ఈ సమావేశంలో తెలంగాణ యాజమాన్యం నుంచి ట్రాన్స్‌కో హెచ్‌ఆర్ డైరక్టర్ అశోక్ కుమార్, సిజిఎం నర్సింహ, ఆంద్రా యాజమాన్య నుంచి ఎపిఎస్‌పిడీసీఎల్ సిఎండి హరినాథ్, జేఎండీ చక్రదర్, సీజీఎం నర్సిహ, తెలంగాణ విద్యుత్ సంఘాల నాయకులు శివాజి, పి. అంజయ్య, రత్నాకర్, పి.సదానందం, తిరుపతయ్య, షరీష్, పున్నానాయక్, మహేందర్ రెడ్డి, పరమేశ్వర్ ,రాజేష్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంఘాల మండిపాటు

విద్యుత్ విభజన ఉద్యోగుల కేటాయింపు విషయంలో ఆంధ్రా యాజమాన్యం మరోసారి తన వివక్షతను నిరూపించుకుందని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజీ, అంజయ్య మండిపడ్డారు. గతంలో జరిగిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ సమావేశంలో కమిటీ సూచనలకు అంగీకరించి, ఇప్పుడు ఒప్పుకోకపోవడం ఆంధ్రా యాజమాన్యం మొండి వైఖరికి నిదర్శనమని అన్నారు.

Telangana and Andhra Pradesh Electricity Staff Divisions