Home తాజా వార్తలు తెలంగాణ అసెంబ్లీ రద్దు

తెలంగాణ అసెంబ్లీ రద్దు

Telangana Assembly Dissolved

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దయింది. తెలంగాణ మంత్రివర్గ ఆమోదం పొందిన అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని సిఎం కెసిఆర్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు గురువారం మధ్యాహ్నం 2గంటలకు అందించారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్ధర్మ సిఎంగా కొనసాగాలని గవర్నర్ కెసిఆర్‌ను కోరారు. ఇందుకు కెసిఆర్ అంగీకరించారు. జూన్ 2, 2014న తెలంగాణ తొలి సిఎంగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన 4 ఏళ్ల 3నెలల 4 రోజుల పాటు తెలంగాణ సిఎంగా పని చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు కలిశారు. శాసనసభ రద్దు గెజిట్ ను రజత్ కుమార్ కు నర్సింహాచార్యులు అందజేశారు.