Home Elections 2018 ఎన్నికల నోటిఫకేషన్ విడుదల

ఎన్నికల నోటిఫకేషన్ విడుదల

Telangana Assembly Election Notification Released

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ విడుదల చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం నుంచి నవంబరు 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబరు 20వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టిఆర్‌ఎస్, బిజెపి, మహాకూటమి నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న విడుదల కానున్నాయి.

Telangana Assembly Election Notification Released