Home తాజా వార్తలు 22 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

22 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana assembly sessions likely from sept 22

 

హైదరాబాద్:  ప్రతి ఆరు నెలల్లో కనీసం ఒక్కసారైనా సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ విధి కారణంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి దాదాపు 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా ఉంది. ఇదివరలో మార్చిలో 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించింది. అయితే కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఆ సమావేశాలను ముందుగానే ముంగించివేసింది. ప్రభుత్వం మొదట్లో సెప్టెంబర్ రెండో వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుందని, కానీ గణేశ్ నిమజ్జనం తర్వాత నిర్వహించేందుకు నిర్ణయించుకుందని అధికారవర్గాలు తెలిపాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే పక్షంలో దళిత బంధు పథకానికి బడ్జెటరీ మద్దతు అందించనుందని తెలుస్తోంది.

రాష్ట్రంలోని 17 లక్షల  దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం దశలవారీగా అమలుచేయనున్నది. దీనిని మొదటగా హుజురాబాద్, ఇతర మండలాల్లో చేపట్టనుంది. కృష్ణ, గోదావరి ప్రాజెక్టులపై, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ సాధకబాధకాలపై పూర్తిస్థాయి చర్చ జరపాలని కూడా ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలతోపాటు శాసనమండలి చెర్మన్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. గుత్తా సుధాకర్ రెడ్డి పదవీ కాలం జూన్ 3న ముగియడంతో గత మూడు నెలలుగా ఆ పదవి ఖాళీగా ఉంది. కాగా సిట్టింగ్ ఎంఎల్ సి  వి.భూపాల్ రెడ్డి తాత్కాలిక చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.

Telangana assembly sessions likely from sept 22