Saturday, April 20, 2024

నేటి నుంచి బతుకమ్మ

- Advertisement -
- Advertisement -
Telangana Bathukamma celebrations 2020
ఎల్లుండి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు,  ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు జాగృతి సంస్థ దూరం, నిధులు విడుదల చేయని ప్రభుత్వం

హైదరాబాద్: నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు, ఎల్లుండి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ప్రస్తుతం ఈసారి బతుకమ్మ నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. ప్రతిసారి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 నేపథ్యంలో జాగృతి సంస్థ తరఫున బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించరాదని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే బతుకమ్మలకు సంబంధించిన పాటలను, సాహిత్యాన్ని జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించారు. వీటికి సంబంధించి పాటలను, సాహిత్యాన్ని నేడు విడుదల చేయనున్నట్టుగా జాగృతి సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

మార్చి నెల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి పండుగ ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల పండుగలను ప్రజలు ఆ విధంగానే జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మతో పాటు దేవి నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశం లేదని, ఒకవేళ అనుమతి ఇచ్చినా గుంపులుగా కాకుండా, కోవిడ్ 19 నిబంధనలు పాటించేలా మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. దేవి నవరాత్రులను జరుపుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దేవినవరాత్రులకు అనుమతి ఇచ్చినా ముగ్గురు లేదా నలుగురు పూజలో పాల్గొనేలా, భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించి నవరాత్రులను జరుపుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవాలని భావించిన రాష్ట్ర మహిళలు ఈసారి నిరాశ చెందుతున్నారు.

ఈసారి ఇంటికే పరిమితమవుతున్న పెద్ద బతుకమ్మ

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈసారి ఇంటికే పరిమితం కానుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న అన్నిమతాల పండుగలు రద్దయిపోతున్నాయి. అదేకోణంలో ఈసారి పెత్తరమాస పెద్ద బతుకమ్మ పండుగ కూడా ఇంటికే పరిమితం కానుంది. ప్రతిఏటా మహిళలు అంగరంగవైభవంగా జరుపుకునే తొమ్మిదిరోజుల మొదటి పెద్ద బతుకమ్మ పండుగకు మహిళలు ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తారు. కరోనా వైరస్ వల్ల ఈసారి పండుగ ఇంటికే పరిమితం కానుంది. బతుకమ్మ పండుగను దేవాలయాల్లో నిర్వహించనున్నందున వాటిని నిషేధిస్తున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల్లో బతుకమ్మపండుగ వేడుకలను నిర్వహించాలా.. వద్దా అన్న మీమాంసంలో ప్రజలున్నారు. జిల్లాల వారిగా బతుకమ్మ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో నేడు జరగనున్న పెద్ద బతుకమ్మకు మిశ్రమ స్పందన కనపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News