Friday, July 11, 2025

బిజెపి నాకు గొప్ప అవకాశం ఇచ్చింది: రామచందర్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బిజెపికి మార్గదర్శకంగా ఉన్నారని ప్రశంసించారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరించారు. కిషన్‌రెడ్డి నుంచి రామచందర్‌రావు బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు గొప్పగా ఉండడంతో పాటు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు బిజెపి అండగా నిలబడుతుందని రామచందర్ రావు స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడికి బిజెపి శ్రేణులు అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News