Home తాజా వార్తలు ముగిసిన మంత్రివర్గ సమావేశం

ముగిసిన మంత్రివర్గ సమావేశం

Etela

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. 50శాతం పైబడి ఉన్న బిసి కులాల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్‌లో 7ం కోట్లతో 75 ఎకరాల భూమిలో భవనాలు నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రివర్గ ఆమోదించిందన్నారు. రెడ్డి హాస్టల్ భవనాల కోసం మరో ఐదు ఎకరాలు కేటాయించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో గోపాల మిత్ర గౌరవ వేతనం రూ.3500 నుంచి రూ. 8500 పెంచామని వివరించారు. దేవాలయాల్లో పూజలు చేసే అర్చకుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుంచి 65కు పెంచడం జరిగిందని వెల్లడించారు. కరీంనగర్‌లో మిడ్ మానేరు ప్రాజెక్టు కింద ఉన్న మనువాడ గ్రామ భూనిర్వాసితులకు రూ.25.48 కోట్లు ప్రభుత్వం ఇస్తుందని ఈటెల స్పష్టం చేశారు.