Home తాజా వార్తలు నేడు మంత్రివర్గం భేటీ

నేడు మంత్రివర్గం భేటీ

Telangana cabinet to meet today at Pragati Bhavan
Telangana cabinet to meet today at Pragati Bhavan

 

మధ్యాహ్నం 2గంటలకు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభం
నూతన సచివాలయం నమూనా, కరోనా కట్టడి, నియంత్రిత పంటల సాగు, జలవనరుల శాఖకు కొత్త రూపు, విద్యాసంవత్సరంపై చర్చించే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధానంగా కొత్త సచివాలయం నమూనా, కరోనా వ్యాప్తి, నియంత్రిత పంటల సాగు, జలవనరుల శాఖ కు తీసుకరావాల్సిన కొత్త రూపు తదితర అఁశాలపై సిఎం కెసిఆర్ విపులంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా కొత్త సచివాలయం నమూ నా, జలవనరుల శాఖపై నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన నేపథ్యంలో మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సచివాలయ నిర్మాణాన్ని ఇప్పటి వరకు ఆరు ఆరు అంతస్థుల్లో నిర్మించాలని భావించినప్పటికీ సిఎం కెసిఆర్ చేసిన సూచనల మేరకు ఆర్కిటెక్చర్లు ఏడు అంతస్థులతో రూపొందించిన నమూనా సిఎంకు అందజేశారు. ఏడవ అంతస్తులోనే సిఎం కార్యాలయం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఈ నమూనాకే దాదాపుగా సిఎం కెసిఆర్ ఒకే చెప్పనున్నారని తెలుస్తోంది. అయితే నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త నమూనాపై మరోమారు చర్చించి మంత్రులు, సంబంధిత అధికారుల అభిప్రాయలను తెలుసుకుని సిఎం కెసిఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. తదనంతరం జలవనరుల శాఖపై కూడా అధికారులతో సిఎం చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నింటిని ఒకే గొడుగు కింద తీసుకరావాలన్న లక్షంతో నీటి పారుదల శాఖను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖగా మార్చింది.

ఈ శాఖకు పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చరించి సిఎం కెసిఆర్ పలు నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ అంశాలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో వైరస్ విలయం తాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుతం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో కోవిడ్..19 నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నప్పటకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి… వైరస్ బాగా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన కఠిన చర్యలు, కంటైన్మెంట్ ప్రాంతాలను మరింతగా పెంచే అంశంపై కూడా సిఎం కెసిఆర్ కూలంకషంగా చర్చించనున్నారు. అలా గే కేంద్ర ప్రభుత్వం కొత్తగా విద్యారంగంలో తీసుకొచ్చిన పలు సంస్కరణలతో పాటు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడం…. అందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఎప్పటి నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించాలనే అంశంపై కూడా సిఎం కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Telangana cabinet to meet today at Pragati Bhavan