*ఐదు లక్షల లీటర్ల ఉత్పత్తికి ఎదుగాలి
*డెయిరీలో రైతుల పాత్ర కీలకం
*పాడి పశువులకు సబ్సిడీ రుణాలు
*కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్
మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్:ఉద్యమించి సాధించికు న్న రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలని కరీంనగర్ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కరీంనగర్ పాల డెయిరీలో సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీలలో ప్ర తిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేసి, ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘ నత సిఎం కెసిఆర్‌ది అన్నారు. దేశంలోనే కరీంనగర్ డె యిరీ 11వ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో మన కరీంనగ ర్ ఉండటం మరవలేదన్నారు. డెయిరీలో రైతుల పాత్ర కీలకమన్నారు. లక్ష లీటర్ల నుండి కరీంనగర్ డెయిరీని 5 ల క్షల లీటర్ల ఉత్పత్తులకు ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అందులోని భాగంగానే నాబార్డ్ నుంచి దేశంలోనే ఒక కరీంనగర్ డెయిరీకి మాత్రమే 50కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. మన రాష్ట్రానికి బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నుండి పాలు దిగుమ తి అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఇతర రా ష్ట్రాలకు వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందులోని భాగంగానే ప్రతి ఇంటికి పశువులను అందించి పాడి ఉత్పత్తిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం 50 శాతం సబ్సిడీతో, ఎస్‌సి, ఎస్‌టిలకు 75 శా తం సబ్సిడీతో అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రైతుల కుటుంబాలలో ఉన్న పిల్లలు మంచిగా వి ధ్యాను అభ్యసించి, పైచదువుల కోసం ఇతర దేశాలకు వె ళ్లేందుకు కూడా ప్రభుత్వం రుణం 20లక్షలు మంజూరు చేస్తుందన్నారు. జడ్‌పి చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిర్లక్షం వలన పాడి పరిశ్రమలు కుంటుపడ్డాయని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు సిఎం కెసిఆర్ అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధే లక్షంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. కరీంనగర్ డెయిరీ 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులకు ఎదిగేందు కు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్, ఎంపి వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పశు ఘన శాఖ చైర్మన్, కరీంనగర్ జిల్లా పాల డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీ 75 పాడి కుటుంబాల సహాయంతో ముందుకు వెళ్తుందన్నారు. 12 వేల లీటర్ల ఉత్పత్తితో లక్షకు పైగా లీటర్లను ఇప్పటి వరకు అధిగమించమన్నారు. రాబోయే రోజుల్లో 5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రతి లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం ఇచ్చేందుకు కరీంనగర్ ఎంపి కృషి చే శారని వారి సేవలు మరవలేనివని అన్నారు.
హైదరాబాద్‌లో 25సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు 20 వేల లీటర్ల పాల అమ్మకాలు జరుపుతున్నామన్నారు. రాబో యే రోజుల్లో లక్ష లీటర్ల అమ్మకాలను చేస్తామన్నారు. ఎం పి, తెలంగాణలోనే కరీంనగర్ పాల డెయిరీ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఇందుకు సహకరిస్తున్న సిఎం కెసిఆర్‌కు, ఎంపి వినోద్ కుమార్‌కు పాడి రైతులు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అంతకుముందు కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను ఎంపి వినోద్ కుమార్ పరిశీలించారు.
నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపిపి వాసాల రమేశ్, జక్కుల నాగరాజు, గుర్రం భూంరెడ్డి, డెయిరీ సిబ్బంది, పాడి రైతు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.