Home జాతీయ వార్తలు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సిఎం కెసిఆర్ బిజీ బిజీ

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సిఎం కెసిఆర్ బిజీ బిజీ

Telangana CM KCR Busy In Delhi Tourఢిల్లీ : ఈ నెల 2న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సిఎం కెసిఆర్ బిజీబిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 3న వసంత్ విహార్ లో తెలంగాణ భవన్ కు కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై పలు సమస్యలపై చర్చించి, వినతిపత్రాలు అందించారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కెసిఆర్ భటీ అయ్యారు. తెలంగాణకు సరిపోను సంఖ్యలో ఐపిఎస్ లను కేటాయించాలని ఆయన అమిత్ షాను కోరారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు కెసిఆర్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు కెసిఆర్  కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో భేటి కానున్నారు.