Home తాజా వార్తలు ప్రధానితో సిఎం కెసిఆర్ భేటీ

ప్రధానితో సిఎం కెసిఆర్ భేటీ

KCR-Modi1

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సోమవారం సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని సెవెన్ రేస్‌కోర్స్ రోడ్‌లో గల ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కెసిఆర్ రిజర్వేషన్ల అంశంతో పాటు వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం వర్తింపు, అసెంబ్లీ సీట్ల పెంపు, ఎస్‌సి వర్గీకరణ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం, హైకోర్టు విభజన, ఎపి పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాలు తదితర అంశాలపై ప్రధానితో చర్చించనున్నారని సమాచారం. అలాగే మోడీ ప్రస్తావించిన ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు అనే అంశం కూడా ఈ భేటీలో పరిగణలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.