Home జాతీయ వార్తలు ఢిల్లీ పర్యటనలో కెసిఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో కెసిఆర్ బిజీబిజీ

Telangana CM KCR Tour In Delhiఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సిఎం కెసిఆర్ బిజీబిజీగా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కెసిఆర్ భేటీ అవుతారు.  ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కెసిఆర్ భేటీ కావడం గమనార్హం. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కెసిఆర్ లేఖ ఇచ్చారు. ఆదివారం కేంద్రహోంశాఖ నేతృత్వంలో జరిగే సమావేశంలో కెసిఆర్ పాల్గొంటారు. ఈ నెల 2న ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం వెళ్లిన కెసిఆర్ దాదాపు 9 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. ఆ సమయంలో ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి షెకావత్‌తో పాటు పలువురు ప్రముఖులతో కెసిఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు.