Home తాజా వార్తలు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న కెసిఆర్

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న కెసిఆర్

KCRమహబూబ్‌నగర్‌ : తెలంగాణ సిఎం కెసిఆర్ మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పిఎల్ఐ) పనులను పరిశీలించారు. గురువారం ఉదయం ఆయన పిఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని కరివెన జలాశయాన్ని విహాంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. కరివెన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి అధికారులు అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా కెసిఆర్ వట్టెం, నార్లాపూర్ రిజర్వాయర్లను కూడా పరిశీలించారు..

Telangana CM KCR Visit Karivena Project in MBNR