Home తాజా వార్తలు తెలుగు ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్న: కెసిఆర్

తెలుగు ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్న: కెసిఆర్

CM-KCR

తిరుమల: శ్రీవారిని సిఎం కెసిఆర్ సతీసమేతంగా కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉదయం విఐపి ప్రారంభదర్శన సమయంలో కుటుంబీకులు, మంత్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదట కుటుంబసమేతంగా వరాహస్వామిని సిఎం దర్శించుకున్నారు. వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనంలో ఆయలయానికి చేరుకున్నారు.

అనంతరం మహాద్వారం నుంచి స్వామివారి ఆలయంలోకి కెసిఆర్ సతీమణి శోభతో కలిసి వెళ్లారు. వెంకన్న దర్శనం అనంతరం మొక్కులు చెల్లించారు. రూ. 5కోట్ల విలువైన  14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల కంఠాభరణాలను స్వామివారికి సమర్పించారు. ఆలయ అర్చకులు కెసిఆర్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ… తెలుగు ప్రజలను శ్రీనివాసుడు చల్లగా చూడాలని కోరుకున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా వెలుగొందాలని, ఇరు రాష్ట్రాలు అభివద్ధి చెందాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్నీ సమస్యలు తొలిగిపోతాయన్నారు.