Home తాజా వార్తలు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

Congressఢిల్లీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ క్రమంలో రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉదయ్ మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లా అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డి, నల్లగొండ జిల్లా అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డిలను ఎంపిక చేసింది. వీరు రేపు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ మూడు స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

Telangana Congress MLC Candidates Finalized