Home తాజా వార్తలు రూ.3.7కోట్ల గంజాయి పట్టివేత

రూ.3.7కోట్ల గంజాయి పట్టివేత

Telangana cops seize 1820 kg ganja worth Rs 3.7 cr

 

సీలేరు నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టుకున్న రాచకొండ పోలీసులు

మనతెలంగాణ/ఎల్బీనగర్ : నగరంలో మరోసారి గంజాయి భారీ ఎత్తున్న రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1820 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.3 కోట్ల 7లక్షలు 93 వేలు ఉంటుందని అన్నారు. విశాఖ పట్నం సీలేరు నుంచి మహరాష్ట్రకు తరిలిస్తుండగా రాచకొండ పోలీసులు గుర్తించారు. గంజాయి సీజ్ చేసి దాన్ని తరిలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సిపి మహేష్ భగవత్, అడి షనల్ కమిషనర్ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డిసిపి సర్‌ప్రీతి సింగ్ ,ఎస్‌ఓటి డిసిపి సురేందర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఎస్‌ఓటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికూమార్‌లు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి ముఠా సభ్యుల వివరాలు వెల్లడించారు.

మహరాష్ట్ర ఉస్మాన్‌బాద్ జిల్లా కలంబా తాలుకాకు చెందిన సంజయ్ లక్ష్మణ్ షిండే (26) వ్యాపారం చేస్తుంటాడు. మహరాష్ట్ర ఉస్మాన్‌బాద్ జిల్లా భూమ్‌కు చెందిన సంజయ్ బాలాజీ కలే (30) వ్యవసాయం చేస్తుంటాడు. మహరాష్ట్ర సోలపూర్ ఇందిరానగర్‌కు చెందిన అభిమాన్ కళ్యాణ్ పవార్ (49) వ్యవసాయం చేస్తుంటాడు. మహరాష్ట్ర అహ్మ ద్‌నగర్ జిల్లా జామ్‌కేడ్ తాలుకా ఖాద్ర గ్రామానికి చెందిన సంజయ్ చుగ్లే (45) వ్యాపారం చేస్తుంటాడు.. మహరాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లా జామ్‌కేడ్ తాలుకా ఖాద్ర గ్రామానికి చెందిన భారత్ కోలప్పయ్లే (37) డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. పశ్చిమబెంగాల్ నదియా జిల్లా కాళిగంజ్ తహిశీల్ ఉత్తర హజ్రాపోటా గ్రామానికి చెందిన షేక్ రాహుదుల్ (27) డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. సంజయ్ లక్ష్మణ్ షిండే పరారీలో ఉన్నాడు. సంజయ్ బాలాజీ కలే ,అభిమాన్ కళ్యాణ్ పవార్ ముగ్గురు బంధువులు . షేక్ రాహుదులే అక్రమ వ్యాపారంలో డ్రైవర్‌గా చేయడం దిట్టా.