Home తాజా వార్తలు 54 లక్షలు దాటిన కరోనా టెస్టులు

54 లక్షలు దాటిన కరోనా టెస్టులు

Telangana covid-19 tally crosses 54 lakh-mark

 

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 54 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల 20 వేల 421 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల మందిలో లక్షా 45 వేల 631 మందికి టెస్టులు పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా శనివారం 46,280 మందికి టెస్టులు చేయగా మరో 805 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 131 ఉండగా ఆదిలాబాద్‌లో 10, భద్రాద్రి 42, జగిత్యాల 56, జనగాం 3, భూపాలపల్లి 9, గద్వాల 5, కామారెడ్డి 13, కరీంనగర్ 35,ఖమ్మం 40, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 15, మహబూబాబాద్ 17, మంచిర్యాల 18, మెదక్ 11, మేడ్చల్ మల్కాజ్‌గిరి 82, ములుగు 15, నాగర్‌కర్నూల్ 11, నల్గొండ 32, నారాయణపేట్ 2, నిర్మల్ 7,

నిజామాబాద్ 15, పెద్దపల్లి 21, సిరిసిల్లా 22, రంగారెడ్డి 58, సంగారెడ్డి 24, సిద్ధిపేట్ 17, సూర్యాపేట్ 22, వికారాబాద్ 9, వనపర్తి 8, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ లో 27, యాదాద్రిలో మరో 13 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,69,223కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,57,278కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

95.56 శాతానికి పెరిగిన రికవరీ శాతం
రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 95.56 శాతానికి పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని అధికారులు అంటున్నారు. అయితే తెలంగాణలో రికార్డు అవుతున్న రికవరీ రేట్ మరేరాష్ట్రంలోనూ తేలడం లేదు. మన దగ్గర నమోదవుతున్న శాతం దేశ సగటు 93.7 కంటే అదనంగా తేలడం గమనార్హం. మరోవైపు ప్రతి వంద మందిలో 95 మంది సులువుగా కోలుకోవడంతో డెత్ రేట్ కూడా అతి స్పల్పంగా తేలుతోంది. మన దగ్గర రికార్డు అవుతున్న అతి తక్కువ డెత్ రేట్ మరేరాష్ట్రంలోనూ నమోదు కావడం లేదని ఆరోగ్యశాఖ నివేదించింది.

Telangana covid-19 tally crosses 54 lakh-mark