కొత్తగా 1811 కేసులు,13 మంది మృతి
జిహెచ్ఎంసిలో 521, జిల్లాల్లో 1290 మందికి వైరస్
అప్డేట్స్ కోసం ఆన్లైన్ లింక్‌ను ప్రారంభించిన వైద్యశాఖ
రాష్ట్రంలో 4 లక్షలు దాటిన కరోనా టెస్టులు
505 కు చేరుకున్న కోవిడ్ మృతుల సంఖ్య
60,717కు పెరిగిన కరోనా బాధితులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు 60వేలు దాటాయి. బుధవారం 1811 మందికి పాజిటివ్‌లు తేలగా, వైరస్ దాడిలో 13 మంది చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా 18,263 టెస్టులు చేయగా, జిహెచ్ఎంసిలో 521, ఆదిలాబాద్‌లో 18, భద్రాది 27,జగిత్యాల 15, జనగాం 22, భూపాలపల్లి 20,గద్వాల 28, కామారెడ్డి 11,కరీంనగర్ 97,ఖమ్మం 26, ఆసిఫాబాద్ 6,మహబూబ్‌నగర్ 41 , మహబూబాబాద్ 39, మంచిర్యాల 18, మెదక్ 15, మేడ్చల్ మల్కాజ్గిరి 151, ములుగు 16, నాగర్‌కర్నూల్ 9, నల్గొండ 61,నారాయణపేట్ 9, నిజామాబాద్ 44, పెద్దపల్లి 21,సిరిసిల్లా 30, రంగారెడ్డి 289, సంగారెడ్డి 33, సిద్ధిపేట్ 24, సూర్యాపేట్ 37, వికారాబాద్ 12,వనపర్తి 23, వరంగల్ రూరల్ 18, వరంగల్ అర్బన్ లో 102, యాదాద్రిలో మరో 16 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 60,717కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 44,572కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 15,640 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 10,155 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 505కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16 కేంద్రాల్లో ఆర్‌టిసిపిఆర్, 320 సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు మరో 23 ప్రైవేట్ ల్యాబ్‌లలోనూ పరీక్షలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆన్లైన్ లింక్‌ను ప్రారంభించిన వైద్యశాఖ….
కరోనా వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వైద్యశాఖ ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది. హెచ్‌టిటిపి//హెల్త్.తెలంగాణ.గవ్డ్.ఇన్ అనే లింక్‌లో ద్వారా కోవిడ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. దీనిలో ప్రతి రోజూ నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య, చికిత్సను అందించే ఆసుపత్రులు, ల్యాబ్‌ల వివరాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అంతేగాక ఎవైనా సమస్యలు తలెత్తితే సంప్రదించాల్సిన అధికారుల నంబర్లు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో 4 లక్షలు దాటిన కరోనా టెస్టులు….
తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు సంఖ్య 4 లక్షలు దాటింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు ప్రభుత్వం జూలై 8వ తేది నుంచి యాంటీజెన్ టెస్టులను ప్రారంభించింది. ప్రతి రోజూ ఆర్టిపిసిఆర్, యాంటీజెన్ కలిపి సుమారు 15 నుంచి 19వేలు టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గురువారం నుంచి కంటైన్మెంట్ జోన్లలో మొబైల్ టెస్టింగ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి రోజూ 20 నుంచి 25వేలు టెస్టులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వైద్యశాఖ వెల్లడించింది.
ప్రభుత్వ హాస్పిటల్స్ బెడ్ల వివరాలు(29.7.2020)…
బెడ్లు అందుబాటులో ఉన్నవి నిండినవి ఖాళీలు
సాధారణ 2532 673 1859
ఆక్సిజన్ 4663 1250 3413
వెంటిలేటర్ 1251 265 986
మొత్తం 8446 2188 6258
ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్ల వివరాలు(29.7.2020)….
బెడ్లు అందుబాటులో ఉన్నవి నిండినవి ఖాళీలు
సాధారణ 2283 1122 1161
ఆక్సిజన్ 2096 1422 674
వెంటిలేటర్ 1115 753 362
మొత్తం 5494 3297 2197