Home జాతీయ వార్తలు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రితో కడియం సమీక్ష

మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రితో కడియం సమీక్ష

Kadiyam srihari

హైదరాబాద్: తెలంగాణలో బాలికా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నమని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముంబయిలో కడియం మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేతో శుక్రవారం చర్చలు జరిపారు. ఈ భేటీలో విద్యారంగంలో ఇరు రాష్ట్రాలలో అమలవుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనన్ని 573 గురుకుల పాఠశాలలు తెలంగాణలోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.  గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికి లక్షా 25 వేల రూపాయలను వెచ్చిస్తున్నామని ఆయన సూచించారు. క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యూకేషన్ సబ్ కమిటీ చైర్మన్‌గా తాను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. బాల్య వివాహాలను అదుపుచేసి, బాలికా విద్యను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా కెజిబివిలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పెంచలన్నా ప్రతిపాదనను కేంద్రం అంగీకరించడంతో కెజిబివిలు ఇక దేశవ్యాప్తంగా 12వ తరగతి వరకు విద్యను అందస్తామని తెలియజేశారు.

కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వీటితో పాటు ఈ సంవత్సరం నుంచే ఇంటర్ పస్ట్ ఇయర్ విద్యార్థులకు నీట్, జెఇఇ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. విద్యారంగంలోనే కాకుండా తెలంగాణలో పేద కుటుంబంలోని మహిళల వివాహానికి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాల ద్వారా రూ. 1,00,116 ఇస్తున్నఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి సొంతం అన్నారు. తర్వాత మహారాష్ట్ర విద్యారంగంలో అమలులో ఉన్న పథకాలు, కార్యక్రమాలను వినోద్ తావ్డే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పర్యటించాలని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కడియం కోరారు.