Home కామారెడ్డి అన్ని రంగాల అభివృద్ధే కెసిఆర్ లక్ష్యం

అన్ని రంగాల అభివృద్ధే కెసిఆర్ లక్ష్యం

 Telangana development is more than 29 states

మనతెంలగాణ/దోమకొండ: 29 రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధ్దిలో ముందుకు దూసుకెళుతుందని కామారెడ్డి ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. శుక్రవారం దోమకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం  రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన  గ్రామ పంచాయతీ భవానాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడుతూ 29 రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్దిలో ముందుకు దూసుకెళుతుందని  అన్ని రంగాల ప్రజలకు మేలు చేయడమే కెసిఆర్ లక్షమన్నారు. పిల్లలు మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతో 4 సంవత్సరాలలో 504 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పై చదువులకై లండన్, అమెరికా లాంటి దేశాలలో విద్యార్థుల చదవుల కొరకు రూ. 20 లక్షల వరకు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 102 అంబులెన్స్ వాహనాలను రెండు  అందజేశారన్నారు.

ప్రభుత్వ ఆసుసత్రిలో డెలివరీ అయితే మగపిల్లవారికి 12 వేల చోప్పన,ఆడపిల్ల అయితే 13 వేలతో పాటు కెసిఆర్ కిట్ అందజేసి తల్లిని పిల్లను ఇంటి వద్ద క్షేమంగా వదిలే సౌకార్యాం ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు.సంగమోశ్వర్ గ్రామంలో 751 ఇండ్లు ఉంటే 705 పేన్షన్‌లు రావడం జరుగుతందన్నారు.24 గంటల నాణ్యమైనా విద్యుత్ ఇస్తున్నామన్నారు.రెండు పంటలకు కలిపి 12 వేల కోట్ల రూపాయలు రైతు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నామన్నారు.ఒక సంగమోశ్వర్ గ్రామంలోనే రూ.60 లక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఆగస్ట్ 15 నుండి రైతుకు జీవితబీమా రూ. 5 లక్షలు స్కీం అమలౌతుందని తెలిపారు.దోమకొండ నుండి ఎన్‌హెచ్ 7 వరకు డబుల్ రోడ్డుకు రూ.16 కోట్లతో నిర్మించడం జరుగుతుందని ఆదే రోడ్డుకు మరో 70 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.అలాగే సంగమోశ్వర్ నుండి గొట్టిముక్కుల గ్రామం వరకు రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. గొట్టిముక్కుల ఎడ్ల కట్ట వాగు బ్రిడ్జి నిర్మానానికి రూ 1 కోటి 12 లక్షలతో బ్రిడ్జి పనులు కోనసాగుతున్నాయన్నారు.సర్పంచ్ లతా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ విప్ గంప గోవర్దన్ సాహకారంతో గ్రామాన్నిఅభివృద్ది చేసుకున్నామన్నారు. రోడ్లు,డ్రైనేజీ,విధీ ధీపాలు,సబ్‌స్టేషన్‌తో పాటు గ్రామంలో నీటి సదుపాయం చేయడం జరిగిందన్నారు.విప్ గంప గోవర్దన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి త్రిబుల్ ఐటిలో సిటు సాధించింన విధ్యార్తి బోడపట స్వప్నని సన్మానించారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి గండ్ర మధుసూదన్‌రావు, ఎంపిపి గంగు బాల్ రాజవ్వ, మార్కెట్ కమిటీ చైర్మన్ అమృతారెడ్డి,వైస్ చైర్మన్ కుంచాల శేఖర్,సింగిల్ విండో చైర్మన్ నర్సారెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు దికొండ శారదారాజశేఖర్,దోర్నల లక్ష్మన్, సాయా గౌడ్,గీతామైసాగౌడ్,తహసీల్దార్ సాయిభుజంగరావు, ఎంపిడిఒ శ్రీనివాస్‌గౌడ్, సురేందర్‌రెడ్డి,మాల్లారెడ్డి,రామస్వామిగౌడ్,సంజీవరెడ్డి,వెంకట్‌గౌడ్,రాయపల్లి రాజిరెడ్డి, వివిధ శాఖల అధికారులు ,ఆయాగ్రామాల రైతు సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.