Saturday, April 20, 2024

నవంబర్ 12న ‘తెలంగాణ దేవుడు’

- Advertisement -
- Advertisement -

'Telangana God' release on November 12

 

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్ర చేయడం నిజంగా గర్వంగా ఉందని అన్నారు. దర్శకుడు హరీష్ వడత్యా మాట్లాడుతూ..‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. చిత్ర నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ఉద్యమ నాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే ఈ చిత్రం చేశాము” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో జిషాన్ ఉస్మాన్, చిట్టిబాబు, కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News