Home తాజా వార్తలు శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిజిపి

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిజిపి

Telangana DGP visits Tirumalaతిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్ రెడ్డి గురువారం ఉదయం దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మహేందర్ రెడ్డి కి వేద పండితులు వేద ఆశీర్వచనం,  తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడారు. ప్రజల సహకారంతో శాంతిభధ్రతలు సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు.

Telangana DGP visits Tirumala