Home తాజా వార్తలు అమెరికాలో తెలంగాణ వైద్యుడి హత్య

అమెరికాలో తెలంగాణ వైద్యుడి హత్య

Doctor-Murdered

కాన్సాస్ : అమెరికాలోని కాన్సాస్ ఈస్ట్ విచితలోని ఓ క్లినిక్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్ అచ్యుతా రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నల్లగొండకు చెందిన అచ్యుతా రెడడి భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున హత్యకు గురైనట్లు సమాచారం. ఉమర్ రషీద్ దత్ (21) అనే వ్యక్తి డాక్టర్‌ని కత్తితో పొడిచి హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.