Home తాజా వార్తలు కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసమ్మతి

కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసమ్మతి

Congress

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీలో  అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. గాంధీ భవన్ ముందు మల్కాజ్ గిరి కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. మల్కాజ్‌గిరి సీటును టిజెఎస్‌కు ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. కూటమి పొత్తులను కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి వాదులు గళం విప్పుతున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీకి నకిరేకల్ సీటు ఇవ్వొద్దని మాజీ ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య అనుచరులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. నార్కెట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ భవనం ముందు తుంగతుర్తి, సూర్యాపేట, పాలకుర్తి నియోజకవర్గాల ఆశావహుల ఆందోళన చేపట్టారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్‌పై తుంగతుర్తి కాంగ్రెస్ నేత జ్ఞాన సుందర్ సంచలన ఆరోపణలు చేశారు. టికెట్లు ఇప్పిస్తామంటూ భక్తచరణ్‌దాస్ కుమారుడు కొంతమంది దగ్గర మూడు కోట్ల రూపాయలు వసూలు చేశాడని సుందర్ ఆరోపణలు చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు డబ్బులు ఇచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana Elections: Congress Workers Strike
Telangana news