Thursday, April 25, 2024

దేవికారాణి దందాపై ఎసిబి ఆరా..!

- Advertisement -
- Advertisement -

Telangana ESI medicines scam

హైదరాబాద్: ఇఎస్‌ఐ స్కాం కేసులోని ప్రధాన నిందితురాలు మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులతో పాటు ఇతర నిందితుల కదలికలపై నిఘా సారించిన ఎసిబి అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈక్రమంలో తాజాగా దేవికారాణి రియల్ దందాను వెలికితీసిన ఎసిబి అధికారులు ఆమె బినామీ ఆస్తులను చిట్టాను వెలికితీసేందుకు దర్యాప్తు సాగిస్తున్నరు. సైబరాబాద్‌లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలను ఎసిబి అధికారులు ఐటి శాఖకు అప్పగించే యత్నంలో ఉన్నారు. అయితే దేవికారాణి, నాగలక్ష్మిలకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ సాగుతోంది. కాగా దేవికారాణి ఇంట్లో దొరికిన కీలక డాక్యుమెంట్ల ప్రకారం రూ. 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఎసిబి అధికారులు అనుమానిస్తున్నరు.

కాగా ఇఎస్‌ఐ స్కాంలో దేవికారాణి అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో వీటి విలువ దాదాపు రూ. 200 కోట్ల మేరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇఎస్‌ఐ స్కాంలో విచారణ కోనసాగుతున్న సమయంలో ఈ కేసులోని నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను రహస్య ప్రాంతాలకు, బినామీల పేరిట తరలించినట్లు ఎసిబి అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఈ కేసులోని 25 మంది నిందితులకు సంబంధించిన ఆస్తులతో పాటు వారి కదలికలు, వ్యాపారాలపై ఎసిబి ప్రత్యేక దృష్టి సారించింది. అదేవిధంగా గతంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని తిరిగి అరెస్ట్ చేసేందుకు ఎసిబి అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారన్నది సమాచారం.

ముఖ్యంగా ఇఎస్‌ఐ స్కాంలో లబ్ది పొందిన ప్రతి ఒక్కరినీ తిరిగి విచారించేందుకు అనుమానితులు, నిందితులకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎసిబి అధికారులు ఆ దిశగా దర్యాప్తు సాగించనున్యానరు. ముఖ్యంగా ఈ కేసులోని ప్రధాన నిందితురాలు దేవికారాణిని మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News